రీడర్స్ నోట్ .. : ఐ లవ్ దట్ లైన్  (మాధ‌వ్ గారి అభౌతిక స్వ‌రం చ‌దువుతూ..)

-

“జారిపోయిన స్వేచ్ఛ పిల్ల‌ల‌ది
త‌ప్పించుకున్న బాధ్య‌త పెద్ద‌ల‌ది”
రొనాల్డ్ రీగ‌న్ గురించి రాస్తూ చెబుతున్నాడ‌తడు
“జీవితం ఎక్క‌డో ఓ చోట నిల‌బెట్టి మూల్యం అడుగుతుంది”
పెద్ద  గీత చిన్న‌గీత
అబ్బా.. వంక‌ర టింక‌ర‌నూ న‌మ్మ‌రా..
దేహాలు గోడ‌లు  జీవితాలు
గోడ‌లు గొడ‌వలు అశాంతి ఆనవాళ్లు
మిగ‌తా  మ‌నిషి మిగ‌తా దుఃఖం
చావే ఒక ప‌రిష్కృతి
బాధ్య‌త‌గా త‌ప్పుకున్నాడు నాన్న
భుజాల‌పై ఎక్కి ఊరేగించింది అమ్మ
నాన్న అమ్మ బిడ్డ‌ల‌కు  వేర్వేరు
లోకానికి మాత్రం ఒక్క‌టే
చిక్కంతా ఇక్క‌డే
ఇదీ ఒక‌రి మాట
అప‌రిమిత జ్ఞానం ఒక‌టి ఉక్కిరి బిక్కిరి
అస‌లీ  మితిని న‌మ్మ‌మ‌ని ఎవ్వ‌డు చెప్పేడు
అబ్బా.. లెక్క‌లు తేల‌లేదు ఏంటంట
వీధిలో  ఖాళీ ఇంట్లో ఖాళీ జీవితం ఖాళీ
మ‌రి! వాడిని వీడిని ఎందుక‌ని ఆ గుమ్మంపైకి ఎక్కిస్తా
సుద్దులు చెబుతావు..
ఇష్టంగా పెంప‌కం.. ఇష్ట‌మ‌యిన దారి.. భోజ‌నం నీదే జ్ఞానం ఎవ‌డిది
అస‌లీ వికాసం ఎవ్వ‌డు ఇస్తాడు.. ఇచ్చినోడ్ని  నిల‌దీయాలి
ఎవ‌డూ ఎవ్వ‌డినీ ఎద‌గ‌నీయడం లేదు క‌దా..
బాగా చ‌దువుకో.. ద‌రిద్ర‌మ‌యిన మాట..
దేవుడికో .. దారి చూప‌మ‌ని
మ‌నిషికో వివేకం అందించ‌మ‌ని
ఎవ్వ‌రయినా అడుగుతున్నారా..
ర‌ద్ద‌యిన దారులు ఎన్ని ఉంటే అంత మేలు క‌దా..

 

వేసంగి గాలులు వ‌సారాలో ఉన్న‌వారికి చ‌ల్ల‌ని స్ప‌ర్శ.. న‌ది చెంత ఉన్న‌వారికి ప‌ల‌క‌రింపు.. గాలులు క‌దా  అవి అలానే ఉండ‌వు..తుఫానును తోడ్కొని ఉం టాయి..హొయ‌లు పోతాయి..వ‌గ‌లు పోతాయి.. అర్థం అయి కాన‌ట్టు ఉంటే వా టికో  గుర్తింపు కూడా.. ఇప్పుడా పెద్ద తుఫాను ఒక‌టి వ‌స్తుంది.. ఆ తుఫానుతో పాటు గుండెలోగిలిలో కూడా తుఫానులే ఉన్నాయి. గ‌తం చెరిపేసిన  తుఫాను ఒక‌టి ప‌ల‌క‌రిస్తే ప్రేమారా ఆ తుఫాను ను మ‌రిచిపోదునా.. గాయం మోసుకు వ‌చ్చిన తుఫాను అయితే మ‌ళ్లీ గ‌తం వైపు చూద్దునా.. జ్ఞానం అత్తెసరుగా ఉ న్న‌ప్పుడు తెలివి తెంప‌రిత‌నం తోడుగా ఉంటాయి.. తెంప‌రితనం  వెన్నాడిన‌ ప్పుడు ఇత‌రుల‌కు ఒక‌రి పొగ‌రు  ఓ అవివేకంగా తోస్తుంది. అస‌లీ పొగ‌రు లే కుండా తెలివి ఎలా రాణిస్తుంద‌ని???

జ్ఞానం రెక్క‌లు క‌ట్టుకుని ఎగ‌ర‌నిస్తుంద‌ని ఏనాడ‌యినా అనుకోవ‌డం మానుకో వాల‌న్న‌ది ఒక‌రి హిత‌వు..పిల్లల‌ విష‌య‌మై మ‌నం రెక్క‌లు ఇచ్చి చెప్పాల్సిం దంతా చెబుతున్నాం..ఒరేయ్ దీనికి స్వేచ్ఛ అని పేరు పెడ‌తారేంటి? ఏహ్యంగా తోచింది.. తీరిక లేకుండా చేసే ఆలోచ‌న‌ల ద‌గ్గ‌ర పిల్ల‌ల‌ను క‌ట్ట‌డి చేసి  మ‌నం మాత్రం ద‌ర్జాగా వాటికి కేరింగ్ అని పేరు పెడుతున్నాం.. రాత్రి  ఎనిమిదింటికి చే రుకున్న నాన్న పొగ‌లు గ‌క్కుతూ  వ‌స్తుంటాడు..ఆ పొగ‌ల పొడ ద‌గ్గ‌ర దేహాల‌ ను  దాపెట్టి పిల్ల‌ల‌కు నీతి నేర్పుతారా..? ఏం నేర్పుతార‌ని.. క‌డివెడు క‌న్నీళ్ల‌ ను ఇచ్చి ప్రేమార‌గా తుడిచి భ‌రోసా ఇచ్చి పంపుతున్నారా. ఉండ‌డం లేక‌ పో వ‌డం  ఏమీ వొద్దు.జ‌న్మ ఇచ్చారు క‌దా చావండ‌ని అంటున్నారా లేకా చంపే సేంత ఇష్టంతో పెంచుకుంటున్నారా..?

క‌ల‌లు ఇచ్చాం క‌దా అని ఎన్ని రంగులు మీరు  పులుముతున్నారో అర్థం అ యి ఛ‌స్తుందా లేదా..బాధ్య‌త‌గా పెంప‌కం అరిచి గీ పెట్ట‌డం.. బాధ్య‌త‌గా త‌ప్పు కోవ‌డం అరిచాక గొంతుని స‌వ‌రించుకోవ‌డం.. బిడ్డ‌ల‌కు  బిడ్డ‌ల‌కూ మ‌ధ్య ఎన్ని దూరాలు.. క‌ల‌ల‌ను చెరిపేసి న‌దిలో క‌లిపేయండి శ‌వాలు తేలాక  మీ శోకాలు మీ ఆరాలు మొద‌లెట్టండి..జవం-జీవం-శ‌వం ఈ మూడింటి మ‌ధ్య గీతను చెరి పేశాక త‌ప్పించుకున్న బాధ్య‌త నెత్తిన ఉంటూ బ‌తికిన కాలంతో ఊడిగం చేయి స్తుంది…బానిస‌గా మారాక మిగులు దుఃఖం రాత్రి నిషా అన్నీ అన్నీ  క‌డ‌దాకా తోడు.. ఒక‌టి విషాదం మ‌రొక‌టి నిషాదం…

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Latest news