ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు తొలగించుకునేందుకు చిట్కాలు..!

-

ప్రసవం తర్వాత మహిళలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా సరే డెలివరీ తర్వాత ఆడవాళ్లు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. అందులో ముఖ్యంగా పొట్ట మీద ఏర్పడే గీతలు కూడా ఉంటాయి. దీని వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తల్లిగా మారాక ఇదవరకు చర్మ సౌందర్యం పొందటం కోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల పొట్ట మీద గీతల్లా కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అదే డెలివరీ అయ్యాక ఏర్పడే స్ట్రెచ్ మార్క్ పొయేలా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ గీతలు కొద్దిరోజుల్లోనే కనిపించకుండా మాయమవుతాయి. ప్రెగ్నెన్సీ వల్ల ఆడవాళ్లు ఎక్కువ బరువు పెరుగుతారు.. దాని వల్ల కూడా పొట్ట భాగంలో గీతలు పడే అవకాశం ఉంటుంది. పొట్ట భాగంలో స్కిన్ వెనకాల ఫైబర్ కాస్త విరిగిపోవడం వల్ల ఇలాంటి గీతలు కనిస్తాయని తెలుస్తుంది.

అంతేకాదు కవలలు కడుపులో ఉన్నా.. కడుపులో బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్న ఈ గీతలు వస్తాయట. ఇక వీటిని పోగొట్టుకునే పరిష్కార మార్గాలను చూస్తే.. రోజు పౌష్టికాహారం తీసుకుని.. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది.. ఇక నిమ్మరసాన్ని తాగుతూ ఉంటే మంచిది.. ప్రెగ్నెసీ అప్పుడు మరీ ఓవర్ వెయిట్ లేకుండా జాగ్రత్తపడాలి.

థేపీ ద్వారా పొట్టపై గీతలు పోగొట్టాలి అంటే రెటినాల్ తో పాటుగా జోజో నూనె వాడితే పొట్టపై గీతల్ని పోగొట్టవచ్చని తెలుస్తుంది. ప్లెట్ లెట్ రిచ్ ప్లాస్మా అనే విధానం కూడా దీనికి సహకరిస్తుంది. ఈ ధెరపి పొట్టపై గీతలు పొగొట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసంలో వీట్ జెర్మ్ తో పాటుగా ఆలివ్ ఆయిల్, కోకో బటర్ కలిపి స్ట్రెచెస్ పై పూసుకోవడం వల్ల ఆ గీతలు తగ్గుముఖం పడతాయి.

కేవలం పొట్టమీద మాత్రమే కాదు తొడలు, చాతిపై కూడా ఈ గీతలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీగా ఉన్నప్పటి నుండే బాదం నూనె, కోకోవా బటర్ తో పొట్ట భాగాల్లో మసాజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రెచ్ మార్క్ వచ్చే అవకాశం ఉండదు. సుగర్, బాదం నూనె, విటమిన్ ఈ ఉండే క్రీం తో పాటుగా కలబంద రసాన్ని కలుపుకుని ఆయిల్ గా తయారు చేసుకుని దాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆముదం ద్వారా పొట్టపై గీతలను పోగొట్టవచ్చు. నిమ్మరసం స్ట్రెచ్ మార్క్ పై రాసుకోవచ్చు. సుగర్ ను స్ట్రెచ్ మార్క్స్ పై పూసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news