కరోనా నియంత్రణకు ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్ పవార్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేశారు.
ఫలితంగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు. లక్షణాలు కొంత తీవ్రంగా ఉన్న వారు మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలపాటు ఆవిరి పట్టడం ద్వారా వారం రోజులలోనే కోలుకున్నట్టు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఆవిరి చికిత్సలో భాగంగా కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం, పసుపు వంటి వాటిని స్టీమ్ థెరపీలో ఉపయోగించారు.