కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనా వచ్చిన వారు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. దీని వల్ల కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతరం కాకుండా, ప్రాణాపాయ పరిస్థితులు సంభవించకుండా ఉంటాయి. అందులో భాగంగానే చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్ సి, డి, జింక్, అమైనో ఆమ్లాలైన లైసిన్, అర్జినిన్‌లను తీసుకుంటున్నారు. ఇక ఆయుర్వేద విషయానికి వస్తే తిప్పతీగ, పసుపు, తులసి వంటి మూలికలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
అయితే చైనా, మడగాస్కర్ దేశాలు కొన్ని మూలికా సూత్రాలను ఉపయోగించి కోవిడ్ నుంచి త్వరగా బయట పడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. హైపెరికమ్స్, ఇనులా రేసెమోసా, ఆండ్రోగ్రాఫిస్, గ్లైసిరిజ్జా కలిగిన టీసీఎం ఫార్ములాను చైనా ఉపయోగించింది. ఈ క్రమంలో డాక్టర్ లేదా హాస్పిటల్ అవసరం ఉన్నా లేకున్నా కోవిడ్ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలోనే చైనాలో 2 నెలల్లోనే కోవిడ్ ను అదుపులోకి తేగలిగారని తెలుస్తోంది. అలాగే ఆర్టెమిసియా, వేపలు కలిగి ఉన్న ఆర్గానిక్ ఉత్పత్తులను మడగాస్కర్ ఎక్కువగా ఉపయోగించాలని ప్రోత్సహించింది. వాటిని ఉపయోగించడం వల్ల ఆ దేశంలో కోవిడ్ మరణాల రేటు తగ్గింది. అక్కడ కోవిడ్ మరణాల రేటు 0.5 శాతం కన్నా తక్కువగా ఉంది.
కోవిడ్ చికిత్సలో ఉపయోగించే ప్రధాన మూలికగా ఆర్టెమిసియా మారింది. ఈ మేరకు జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. కోవిడ్ స్పైక్ ప్రోటీన్ కణానికి చేసే బంధాలను ఆర్టెమిసియా ఎలా విచ్ఛిన్నం చేస్తుందో సైంటిస్టులు తెలిపారు. అందువల్ల కోవిడ్ చికిత్సలో ఆయుర్వేదం ప్రాధాన్యతను సంతరించుకుంది.