లాక్డౌన్ అందరికీ ఒకేలా ఉండదు. వైరస్ విజృంభిస్తున్న మాట నిజమే. కానీ లాక్డౌన్ పరిస్థితులు అందరి ఇళ్ళలో ఒకేలా ఉండవు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ళలో నుండి బయటకు రాకుండా చూసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రిపూట రోడ్లమీదే నిద్రలేకుండా గడుపుతున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సూపర్ సుజాత చేసిన ఒకానొక వీడియోలో పోలీసుల కష్టాలు చూస్తే ఎవ్వరైనా సెల్యూట్ చేయాల్సిందే.
లంగర్ హౌస్ పిల్లర్ నంబర్ 104వద్ద ఉన్న పోలీసులతో మాట్లాడిన సుజాత, పోలీసుల కష్టాలని అందరికీ తెలిసేలా చేసింది. మూసీనదికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భార్యా పిల్లలని ఇంట్లో వదిలేసి ప్రజల ప్రాణాలు కాపడడానికి ఎలాంటి సౌకర్యాలు లేని ప్రదేశాల్లో పహారా కాస్తున్నారు.
పోలీసులు ఇంత కష్టపడి అవస్థలు పడుతూ డ్యూటీ చేస్తుంటే, కొందరు ఆకతాయిలు బయటకు వస్తున్నారు. ఆ విషయమై మాట్లాడిన ఒకానొక పోలీసాఫీసర్ ఈ విధంగా అన్నాడు. బయటకు వస్తున్నవారు సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారట. ఇంకా కరోనా విజృంభిస్తుందని తెలిసినప్పటికీ మాస్క్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నాడు. వీడియోలో చూపిన ప్రకారం దోమల బెడద విపరీతంగా ఉంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. కరోనాకి ప్రస్తుతం వ్యాక్సిన్ ఉంది. దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూకి వ్యాక్సిన్ లేదు.
సో.. వారి ప్రాణాల్ని రిస్కులో పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడానికి డ్యూటీ చేస్తున్న పోలీసుల కోసమైనా మాస్కులు ధరించి, రోడ్ల మీదకి రాకుండా ఉంటే బాగుంటుంది.