ఢిల్లీలో కోవిడ్ 19: ఏప్రిల్ 5తర్వాత మొదటిసారిగా 5వేల దిగువకు..

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం గురించి అందరికీ తెలిసిందే. వేలల్లో కేసులు, వందల్లో మరణాలు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అటు ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం, ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం, స్మశానంలో కాల్చడానికి స్థలం లేకపోవడం మొదలగునవన్నీ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. దేశ రాజధానిపై కరోనా పంజా తీవ్రంగా పడింది. ఐతే తాజాగా కరోనా వికృత నృత్యం తగ్గినట్టే ఉంది. తాజాగా వచ్చిన కరోనా కేసులని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

గడిచిన 24గంటల్లో ఢిల్లీలో వచ్చిన కరోనా కేసులు 4524. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత 5వేల దిగువకి కేసులు రావడం ఇదే మొదటిసారి. అంటే 42రోజుల తర్వాత 5వేల దిగువకి వచ్చిందన్నమాట. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 13,98,391. మరణించిన వారి సంఖ్య 21,846గా ఉంది. మొత్తానికి కరోనా కారణంగా విపరీతంగా ప్రభావానికి గురైన రాష్ట్రంగా ఢిల్లీ ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగుతుంది. మరో వారం పాటు లాక్డౌన్ ఉంటుందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news