త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా వైజాగ్ కాబోతుందని అన్నారు మంత్రి రోజా. సీఎం జగన్ మాట ఇస్తే తప్పరని అన్నారు. అయితే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేసి ఆపుతున్నాయని.. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని తెలిపారు. వెనుకబడిన జిల్లాల కోసమే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శాసనసభలో, శాసనమండలిలో తమకు బలం ఉందన్నారు.
” వికేంద్రీకరణ బిల్లును త్వరలో పెడతాం.. ఎప్పుడు పెడతామో మీరే చూస్తారు కదా” అన్నారు. విశాఖ గర్జనను అడ్డుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ ఆరోజు విశాఖలో జనవాని పెట్టారని.. మరి జనవాని కార్యక్రమం ఎప్పుడు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. పవన్ కి షూటింగ్ గ్యాప్ లేదా? అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో వైసిపికి 175 కి 175 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి రోజా.