తెలంగాణాలో లాక్ డౌన్ ఎప్పటి వరకు…?

-

తెలంగాణాలో లాక్ డౌన్ ని ఎప్పటి వరకు పోడిగించాలి అనే దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా లాక్ డౌన్ విషయంలో ఇప్పటికే కేసీఆర్ తన అభిప్రాయం స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు కూడా క్రమ శిక్షణ తో ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ని పొడిగిస్తే మంచిది అని ఆయన ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు.

దీనితో లాక్ డౌన్ విషయంలో తెలంగాణా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం జనాలకు స్పష్టంగా అర్ధమైంది. నేడు ప్రగతి భవన్ లో తెలంగాణా మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. ఇప్పటికే ఓడిస్సా, పంజాబ్ ప్రభుత్వాలు దీనిపై తమ నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణా కూడా నేడు నిర్ణయం వెల్లడిస్తుంది.

ఇక రాత్రి పూట కర్ఫ్యూ ని కఠినం గా అమలు చేసే ఆలోచన తెలంగాణా ప్రభుత్వం చేస్తుంది. సాయంత్రం ఆరు దాటిన తర్వాత నుంచి కరోనా నేపధ్యంలో కర్ఫ్యూ ని కఠినం గా అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో పడిన అకాల వర్షాలు, పేదలకు ఇచ్చే రేషన్ విషయం లో కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే సూచనలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని తెలంగాణా ఈ నెల 30 వరకు పొడిగించే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news