ఉరి శిక్షను ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి…?

-

నిర్భయ దోషులను ఉరి తీస్తున్న నేపధ్యంలో ఇప్పుడు మరణ శిక్ష గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. పలు దేశాల్లో అసలు మరణశిక్షను అమలు చేయడం లేదు. మన దేశంలో కూడా కొన్నాళ్ళు ఎవరిని ఉరి తీయలేదు. నేరం తీవ్రత ఉన్నా సరే మనిషి ఎంత దుర్మార్గుడు అయినా సరే వాళ్ళను ఉరి తీయడం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి మరణశిక్ష రద్దుకు ఒక స్థిరమైన ధోరణి ఉందని చరిత్ర చెప్తుంది.

1977లో, 16 దేశాలు మరణ శిక్షను రద్దుచేసాయి. ప్రస్తుతం, 95 దేశాలు మరణశిక్షను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 9 దేశాలు మాత్రం ప్రత్యేక పరిస్థితులలో తప్ప అన్ని నేరాలకు ఈ శిక్షను రద్దు చేసారు, మరొక 35 దేశాలు కనీసం 10 సంవత్సరాల నుండి నిషేధాలను విధించాయి. ఇతర 58 దేశాలు మరణశిక్షను ప్రస్తుతం కొనసాగిస్తూ నేరాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి,

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, 2009లో 18 దేశాలలో సగటున 714 ఉరిశిక్షలు అమలు చేసారు. అనేక సంవత్సరాల పాటు మరణశిక్షను నిలిపివేసిన తరువాత కొన్నిదేశాలు దాని అమలును మళ్ళీ పునరుద్ధరించాయి. అమెరికా అయితే 1967లో మరణశిక్షలను నిలిపివేసింది కానీ కొన్ని పరిస్థితుల నేపధ్యంలో 1977లో పునరుద్ధరించింది అమెరికా… 2007 సెప్టెంబరు 25 నుండి 2008 ఏప్రిల్ 16 వరకు మళ్ళీ నిలిపివేసింది.

భారతదేశంలో 1995 మరియు 2004 మధ్య మరణశిక్ష ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఆ తర్వాతి నుంచి మన దేశంలో ఉరి శిక్ష అమలు జరుగుతుంది. మన పొరుగు దేశం శ్రీలంక మరణశిక్ష అమలుపై నిషేధాన్ని 2004 నవంబరు 20లో తొలగించింది. అయితే ఆ దేశం ఇప్పటివరకు ఏ మరణశిక్షను అమలు పరచలేదు. 1987లో మరణశిక్షను రద్దు చేసిన తరువాత ఫిలిప్పీన్స్ లో తిరిగి దానిని 1993లో పునరుద్దరించినా తిరిగి 2006లో రద్దు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news