రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కామన్. అయితే, ఎన్నివ్యూహాలు పన్నినా… ప్రతివ్యూహాలు వేసినా.. ప్ర జలకు చేరువ కాకపోతే.. ఫలితం ఏంటి? వారి సమస్యలు తీర్చకపోతే.. ఏం టి ప్రయోజనం. బహుశ ఈ వ్యూ హాన్ని నరనరాన జీర్ణించుకున్న సీఎం జగన్ ప్రజల సమస్యలను తీర్చడం ద్వారా పార్టీని, తన ప్రభుత్వాన్ని పదికాలాల పాటు పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోట వంటి పల్నాడు ప్రాంతంలో వైసీపీ పునాదులను బలంగా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, దీనికి సంబంధించి జగన్ ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా చూపించడం లేదు. కేవలం ఈ పల్నాడు ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు న డుం బిగించారు. వందల కోట్ల రూపాయలను ఆయన తాజాగా కేటాయించారు. దీంతో రాజధాని ప్రాంతం గుంటూరులోని పల్నాడు పరిధిలో ఉన్న ఆరు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండాకు తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్నాటి గ్రామాల దాహార్తి తీరనుంది.
పలు నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాలు, 902 గ్రామాలకు మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,665 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ గ్రిడ్ అందుబాటులోకి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అన్న మాటే వినిపించదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రాంతమైన విజయపురి సౌత్‌లోని మేకల గొంది వద్ద వాటర్ గ్రిడ్ నిర్మించనున్నారు. త్వరలోనే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
34 మండలాలకు లబ్ధిచేకూరే ఈ పథకాన్ని చేపట్టాలని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామం.. రాజకీయంగాకూడా వైసీపీకి మరింత మేలు చేస్తుందని అంటున్నారు. అదే టైంలో టీడీపీ కంచుకోటగా ఉన్న గుంటూరులో ఆ పార్టీకి ఇది పెద్ద మైనస్‌గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.