తెలంగాణలోని ఆ జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేం : నిర్మలా సీతారామన్

-

తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లను అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు తన సొంత రాష్ట్రంలో ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియదా అని అడిగారు.

కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. అయినా అవే జిల్లాల పేర్లు మళ్లీ మెడికల్ కాలేజీల కోసం పంపించారని.. అందుకే తిరస్కరించామని చెప్పారు. తిరస్కరించిన తర్వాత మళ్లీ ఇప్పటివరకు కొత్త జిల్లాల పేర్లు ఇప్పటికీ పంపించలేదని పేర్కొన్నారు.

అమృతకాల బడ్జెట్ అంశంపై దూరదర్శన్ న్యూస్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్​, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని… దానినే తాము అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news