క‌రోనా ఎఫెక్ట్‌ :  ఈ ఏడాది మొత్తం ఇంతేనా…?

-

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ వ్యాప్తితో ప్ర‌పంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఎక్కడిక‌క్క‌డ దేశాలు ప్ర‌జ‌ల జన‌జీవ‌నంపై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఏకంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో మ‌న దేశంలోనూ ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు ముందుగానే స్పందించిన కేంద్రం రాష్ట్రాల‌కు రాష్ట్రాల‌నే లాక్‌డౌన్‌ దిశ‌గా ప్రోత్స‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కేర‌ళ‌, పంజాబ్‌, ఒడిసా వంటి రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో పాక్షికంగా జ‌రుగుతోంది.

వాస్త‌వానికి నిన్న‌టి జ‌న‌తా క‌ర్ఫ్యూ త‌ర్వాత ప‌రిస్థితిని సాధార‌ణం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో నిర్బంధ క‌ర్ఫ్యూ దిశ‌గా ప్ర‌బుత్వాలు అడుగులు వేశాయి. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర వ్యాప్తంగా తాళం వేసినా. ముఖ్యంగా కృష్ణా, విశాఖ‌, ప్ర‌కాశంలో పూర్తిగా 144 సెక్ష‌న్ విధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మ‌రో కీల‌క సందేహం తెరమీదికి వ‌చ్చింది. అది.. క‌రోనా ఎఫెక్ట్ ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుంది? అని. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌బుత్వాలు చెబుతున్న మేర‌కు ఈ నెల 31 వ‌ర‌కు నిర్బంధంలో ఉండాలి.

కానీ, త‌ర్వాత కూడా క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గినా.. రాష్ట్ర ఆర్థిక‌రంగం, ప్ర‌జ‌లు పుంజుకునే స‌రికి.. దాదాపుఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఈ ఎఫెక్ట్ ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా ఇప్ప‌టికే అనేక వృత్తులు మంద‌గించా యి. ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తులు నిలిచిపోయాయి. అదేస‌మ‌యంలో ఉన్న స‌రుకు, నిల్వ‌లు మొత్తంఈ వారం రోజుల్లో క‌రిగిపోవ‌డం ఖాయం. ప్ర‌జ‌ల‌వ‌ద్ద ఆర్ధిక వ‌న‌రులు కూడా తగ్గిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది .

ఈ ప‌రి ణామాల నేప‌థ్యంలో ఇటు ప్ర‌జ‌లు, అటు ప్ర‌భుత్వాలు కూడా పుంజుకునేందుకు మ‌రో ఆరు మాసాలు త‌క్కువ కాకుండా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. క‌రోనా ప్ర‌భావం ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌పై తీవ్రంగా ఉంటుంద‌ని కూడా నిపుణులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news