భారత్ సంవత్సరానికి బంగారం ఎంత దిగుమతి చేసుకుంటుదో తెలుసా..!

-

భారతదేశం లో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంగారు ఆభరణాలకు ఇక్కడ ఉండే ఆదరణ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ధర పెరుగదల తో సంబందం లేకుండా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతాయి. బంగారాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావించడం, ఒక ఆస్తిగా బంగారానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల భారతదేశంలో బంగారానికి ఇంత ఆదరణ లభించింది.

అయితే ఇంత ఆదరణ ఉన్న బంగారాన్ని విదేశాల నుండి మనం ఏటా ఎంత దిగుమతి చేసుకుంటున్నామో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ప్రతియేటా దాదాపు 800-900 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబరు నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల డిమాండ్ తగ్గి, దిగుమతులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మార్కెట్ల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2.08 లక్షల కోట్ల పసిడి దిగుమతయ్యింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు భారీగా తగ్గడం వల్ల ఏప్రిల్ – ఫిబ్రవరి మాసం వరకు సుమారు రూ.1.90 లక్షల కోట్ల పసిడి దిగుమతయ్యింది. గత ఏడాది తో పోలిస్తే ఈ సారి 8.86 శాతం దిగుమతి తగ్గిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి దీంతో విక్రయాలు పెరిగి దిగుమతులు మళ్లీ జోరందుకునే అవకాశముంది అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news