ప్రతినెలా చేయాల్సిన పొదుపు ఎంతో తెలుసా.?

-

బ్యాంకుల ముందు ఓ నలుగురు కలిస్తే చాలు.. రుణాల గురించే చర్చించుకుంటారు. గతంలో బ్యాంకులన్నీ ఫిక్స్‌ డిపాజిట్లు, డిపాజిట్ల చేయాలని సూచించేవి. ఇప్పుడు అవే బ్యాంకులు రుణాలు ఇస్తామని ఆహానిస్తున్నాయి. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు తదితర ఎన్నో రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా తక్కువ సందర్భాల్లో పొదుపు, మదుపు గురించి చెప్తున్నారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారి ఖాతా తెరిచినప్పుడు కూడా రుణాలు, క్రెడిట్‌ కార్డుల గురించే చెప్తున్నారు. ఒకసారి మనం లెక్కలేసుకున్నటై ్లతే.. ఆర్థిక సంవత్సరం 2012 లో ఇంటి అప్పుల సంఖ్య జీడీపీ లో 8.5 శాతం ఉండగా, ప్రస్తుతం 13.5 శాతానికి చేరింది. అదే పొదుపు అయితే 2012లో 24 శాతం ఉండగా ఇప్పుడు అది ఏకంగా 16 శాతానికి పడిపోయింది. ఈ ఒక్క సంఖ్య తో మన అప్పులు, ఆదాయం ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అవగాహన కల్పించాలి..

ముఖ్యమైన విçషయం ఏంటంటే.. నేటి యువత విలాసవంతమైన జీవితం గడిపేందుకు, అంగరంగవైభవంగ పెళ్లిళ్లు, షికారుల కోసమే కానీ.. ఆర్థిక లక్షయం కానీ, భవిష్యత్‌ గురించి ఆలోచించి తీసుకోవడం లేదు. అçసలు విషయం ఏంటంటే ఈ సమయంలో పొదుపు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బ్యాంకులు, ఆర్బీఐ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు, ప్రస్తుతం డిజిటల్‌పై అవగాహన కల్పిస్తున్న మాదిరి పొదుపుపై కూడా కల్పించాలి.

ఎంత చేయాలి..?

నెలకు తక్కువలో తక్కువ 30 శాతం పొదుపు చేస్తే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఆ పొదుపులో సగభాగం దీర్ఘకాల ఆర్థ్ధిక లక్ష్యాలు అనగా పిల్లల చదువు పెళ్లిళ్ల కోసం మదుపు చేయాలి. కానీ.. పతి నెలా ఇలా చేయడం సాధ్యమవ్వదు కాబట్టి, అలా జరిగేలా అలవాటుతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలి.
మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ ద్వారా మదుపు చేయడంతో ఇది సాధ్యవుతుంది. ఈక్విటీ ఫండ్లలో మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు ఎన్పీఎస్, పీపీఎఫ్‌ లాంటి పథకాల్ని కూడా ఎంచుకోవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతాలో అధికంగా డబ్బు ఉంచడంతో అంతా ఉపయోగకరం కాదు. దీని కన్నా ఆ డబ్బంతా ఒక లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కి బదిలీ చేయడంతో అధిక రాబడి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news