పాలిహౌస్ సాగులో నులిపురుగుల సమస్యను ఇలా తొలగించుకోవచ్చు..!

-

ఈ మధ్యకాలంలో పాలీహౌస్ విధానంలో సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా పూలమొక్కల పెంపకం, కార్నేషన్, కూరగాయ పంటలైన టమాట, మిరప, కీరా లాంటి పంటలను పండించుకోవచ్చు. అధిక దిగుబడులు కూడా వస్తాయి.
వ్యవసాయంలో మార్పులు వస్తున్నాయి..ఇంకా పాతపద్ధుతుల్లోనే వ్యవసాయం చేయటం వల్ల లాభం లేదని ఎక్కడికక్కడ టెక్నాలజీని అందిపుచ్చుకుని సాగు చేయటం రైతులు మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా పాలిహౌసి సాగుకు రైతులకు ఎన్నో రాయితీలను ఇస్తూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా ప్రోత్సహిస్తుంది. అయితే పాలీహాఫి సాగు ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా సస్యరక్షణ విషయంలో పాలీహౌస్ సాగులో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
ప్రస్తుతం పాలీవౌస్‌ పూలు, కూరగాయల సాగులో నులిపురుగుల సమస్య అధికంగా ఉందని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. పాలీవౌస్‌ బెద్స్‌లో మట్టి మిశ్రమం నిరంతరం ఎక్కువ తేమను కలిగి ఉంటుంది. నీడ ఉండడంతో నులిపురుగుల పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడి 90 శాతం వరకు దిగుబడిని తగ్గిస్తున్నాయనేది ప్రధాన సమస్య.. నులిపురుగులు ఆశించిన పంటలో అకులు పనుపు రంగుకు మారతాయి. అకులు ఎండి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల లోపించి పూత, పిందెకు రాకపోవడం కూడా జరుగుతుంది. కొద్ది కాలంలో బెడ్స్‌ అంతా వ్యాపించి అన్ని మొక్కలు వదలి ఎండిపోవడం చూడవచ్చు. వడలిన మొక్కలు పీకి చూసినట్లయితే, పూనలు బుడిపెల మాదిరిగా ఎత్తైన , ఉబ్బిన ప్రాంతాలు, వేరు వ్యవస్ధలో వృద్ధి చెందుతాయి. నీటి ఎద్దడికి గురైన పంట లక్షణాలను పోలి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బెడ్స్ వేసే సమయంలో నేలను స్టెరిలైజ్, సూక్ష్మీకరించటం చేయాలి. కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లాలి. బెడ్స్ పై తగిన తేమ ఉండేలా చూడాలి. జీవన ఎరువుల్లో కలిపిన , పశువుల ఎరువు, వానపాముల ఎరువు, వేప పిండిని మొక్కలు వేయకముందే బెడ్స్ పై వేయాలి. పంట వేసే ముందు దానిని కలియదున్ని బెడ్స్ తయారు చేసుకోవాలి. నూనె తీసిన వేపచెక్కకు 4కిలోల పాసిలోమైసిస్ లిలాసియమ్, 4కిలోల ట్రైకోడెర్మా విరిడి, 4కిలోల సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కలపాలి. 20రోజుల తరువాత ఈ మిశ్రామాన్ని పాలీహౌస్ బెడ్స్ పై పశువుల ఎరువుతో కలిపి వేయాలి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. నులిపురుగుల సమస్య లేకుండా అధిక దిగుబడులు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news