ప్రయాణికులకు అలర్ట్ : నేడు హైదరాబాద్ లో 20 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

-

హైదరాబాద్‌ నగర్ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర పరిధిలోని.. 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను.. రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను.. రద్దు నిర్ణయం కేవలం ఇవాళ ఒక్క రోజే మాత్రమే. నిర్వహణ పనుల కారణంగా ఇవాళ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను..రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్‌ – లింగంపల్లి, ఫలక్‌ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌ నుమా మార్గాల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లు రేపు.. ఎప్పటి లాగే నడుస్తాయని స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

ఇది ఇలా ఉండగా.. త్వరలోనే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ జరుగనుంది. రీజనల్ రింగు రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని బీజేపీ నేతలు చేసిన విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే రైల్వే శాఖ అధికారులతో చర్చించి తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కలిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్.

Read more RELATED
Recommended to you

Latest news