చాలా సార్లు మీ ఫోన్లో కొన్ని మార్పులు రావడం చూసి ఉంటారు.మీ ప్రమేయం లేకుండా ఫోన్ తనకుతానే అప్రేట్ అవడం మీరు చూసి ఉంటారు. అంతే కాదు కొన్ని సార్లు మీ ఫోన్ పని చేయడం మానేస్తుంది.. ఇలా జరిగినప్పుడు మీరు ఫోన్ హ్యాంగ్ అయిందని మీరు అనుకుంటారు. కానీ నిజానికి మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని అర్థం.. ఇలా జరిగినప్పుడు మీరు దానిని సాధారణ సమస్యగా భావిస్తారు. మీ స్మార్ట్‌ఫోన్ లో కూడా ఏదైనా వింత జరుగుతున్నట్లయితే.. దానిని సాధారణ సమస్యగానే అనుకుంటారు. ఎందుకంటే ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు సమస్యగా నిరూపించవచ్చు.. మన ఫోన్లో కలిపించె సాదారణ మార్పులు గురించి తెలుసుకుందాం…
*. సోషల్ మీడియా యాప్‌ల లో ఏదైనా ఆటోమేటిక్‌గా చాట్ సందేశాలు కనిపిస్తుంటే.. మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ చేయబడే అవకాశం ఉంది..
*. కొన్ని సార్లు మీరు డెటాను ఉపయోగించనప్పటికీ.. డేటా పోతుంది. అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుంచి సమాచారం బదిలీ చేయబడిందని అర్థం చేసుకోండి. మీకు తెలియకుండానే మీ ఫోన్‌లోకి హ్యాకర్లు వచ్చి.. మీ డేటా వినియోగించుకుని మీలోని సమాచారాన్ని దొంగిలించి ఉంటారు..
*. వెంటనే అలర్ట్ .. ఫోన్ నుంచి కాల్ డయల్ చేయబడి.. నిర్దిష్ట వ్యక్తికి నంబర్‌కు పదేపదే కాల్ చేయబడితే.. ఇది కూడా హ్యాకింగ్ కావచ్చు. అప్పుడు.. మీరు వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపివేసి.. దాన్ని షట్ డౌన్ చేయండి. అప్పుడు సమస్య నుంచి బయట పడవచ్చు..
*. ఇక మీ ఫోన్ లో వేరే యాప్ ను ఓపెన్ చేసినప్పుడు మరో యాప్ ఓపెన్ అయితే ఆ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని.. అందులో ఏదైనా చేస్తే దాని సమాచారం హ్యాకర్లకు చేరే అవకాశం ఉంది.
*. మీ స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా షట్ డౌన్ అయినట్లయితే లేదా దాని డిస్ప్లే మళ్లీ మళ్లీ ఆన్, ఆఫ్ అవుతూ ఉంటే.. అది హ్యాక్ చేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంది వ్యక్తులతో చాలాసార్లు జరిగివుంటుంది.అది గమనించి వెంటనే అలర్ట్ అవ్వాలి..వీలైనంత త్వరగా ఫోన్ ను ఆఫ్ చెయ్యలి..లేకుంటే మాత్రం మీ విలువైన సమాచారం చోరీకి గురవుతుంది..జాగ్రత్త..