ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. నిజానికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపడం కూడా ఈజీగా ఉంటుంది. అలానే మనకు నచ్చిన ఫోటోలను, వీడియోలను కూడా ఇతరులతో పంచుకోవచ్చు. పైగా రోజురోజుకీ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను కూడా తీసుకు వస్తోంది. ఇది మనకి చాలా సౌకర్యంగా ఉంటుంది. నిజానికి చాలా మందికి వాట్సాప్ లో దాగి ఉన్న ఫీచర్స్ తెలియవు.
అలాగే వాట్సాప్ లో కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో ఎవరైనా పంచుకోవచ్చు. వాటిని లాక్ వేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తమ వాట్సాప్ చాట్ లని చూపించడానికి ఇష్టపడరు. ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మనం వాటిని లాక్ చేసుకోవచ్చు. మనం దీనిని ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా ఫేస్ రికగ్నిషన్ అథెన్డిక్టేషన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు.
ఈ వాట్సాప్ లాక్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ కి అందుబాటులో ఉంది ఎవరైనా ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ ద్వారానే ఓపెన్ అవుతుంది. కావాలంటే ఫేస్ లాక్ లాక్ ని కూడా మనం వాడొచ్చు. అయితే ఎలా వాట్సాప్ లో ఆన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో వాట్సప్ ఓపెన్ చేయండి.
మీ యాప్ కి కుడి భాగంలో ఉన్న మూడు చుక్కల పైన నొక్కండి.
సెట్టింగ్స్లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ లోకి వెళ్ళాలి.
ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అని మీకు కనబడుతుంది.
దానిని క్లిక్ చేసి అన్ లాక్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేసి ఎనేబుల్ చేసుకోండి.
ఆ తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ ని ఇవ్వాల్సి ఉంటుంది అంతే.