యాలుకలతో బీపీ, అల్సర్, గ్యాస్ సమస్యలను నియంత్రించుకోవచ్చు.. అధ్యయనంలో తేలిన విషయాలివే.!

-

స్వీట్ల తయారీలో యాలుకపొడి కమ్మని సువాసను ఇస్తుంది. బిర్యానీలు, మసాలాల్లోనూ యాలుకపొడిని వాడుతుంటారు. చక్కటి రుచిని వాసను యాలుక ఇస్తుంది. ప్రకృతి ప్రసాదించిన యాలుకలో ఎలాంటి ఔషధగుణాలు ఉన్నాయి. మనంమంతా స్వీట్ల తయారీలో వాడుతున్నప్పటికీ వాటివెనుక ఉన్న అసలు కారణం చాలా మందికి తెలియదు. సువాసను ఇస్తాయని మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. సైంటిఫిక్ గా యాలుక్కాయలో ఉండే వాస్తవాలేంటి ఈరోజు చూద్దాం.

 

ఈరోజుల్లో బీపీ అనేది సర్వసాధారణమైన జబ్బుగా మారిపోయింది. పల్లెటూర్లనుంచి పట్టణాల వరకూ 100 మందిని తీసుకుంటే 25-30శాతం మందికి బీపీ ఉంటుంది. 40-50ఏళ్ల వయసునుంచి 60-70 ఏళ్ల వయసులోపు వారిని తీసుకుంటే 100కు 70శాతం మందికి బీపీ ఉంటుంది. బీపీ సైలెంట్ కిల్లర్. ఎంతోమంది ప్రాణాలు అర్థంతరంగా కోల్పోడానికి..స్లో పాయిజన్ లాంటి జబ్బు ఈ బీపీ. హై బీపీని పెరగకుండా కంట్రోల్ చేయడానికి యాలుకలు ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా 2009వ సంవత్సరంలో ఆర్ఎన్టీ మెడికల్ కాలేజీ- రాజస్థాన్(RNT Medical College- Rajasthan)వారు నిరూపించారు.

యాలుకలను 1.5 గ్రాములు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం వల్ల..అంటే యాలుకల లోపల ఉండే గింజలు కావాలి. అంటే..ఉదయం 2-3 యాలుకలు అలానే మధ్యాహ్నం, సాయంత్రం కూడా తీసుకుంటే బీపీ పెరగుకుండా బీపీని నియంత్రిస్తుందట. యాలుకల్లో ఉన్న స్పెషల్ కెమికల్ కాంపౌండ్ ప్రత్యేకంగా రక్తనాళాల గోడల్లో ఉండే కాల్షియం ఛానల్స్ ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుందట. ఇవి హెల్తీగా ఉంటే..రక్తనాళాలు బాగా సంకోచ వ్యాకోచాలు చేస్తాయి.

ఈ కాల్షియం ఛానల్స్ కంట్రోల్ తప్పి హార్డ్ గా అయితే..బ్లడ్ విజల్స్ కూడా హార్డ్ అవుతాయి. రక్తనాళాలు ముడుచుకుని సాగితేనే..రక్తం ముందుకు నడుస్తుంది. ఈ సంకోచ వ్యాకోచాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని తెలియచేస్తాయి. ఎప్పుడైతే ఇవి దెబ్బతింటాయో..ఇవి సాగవు. అందుకని సాగడానికి వాడే మందులు బీపీకి ఇస్తుంటారు. బీటాబ్లాకర్స్ మందులన్నీ ఈ కాల్షియం ఛానల్స్ ని కంట్రోల్ చేస్తాయి. నాచురల్ గా యాలుకలు ఈ రక్తనాళాలను బాగా సంకోంచింపచేసి..సాగేటట్టు చేస్తున్నాయని నిరూపించారు. మూడు పూట్ల రెండేసి యాలకలు తినటం వల్ల బీపీ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇవి తింటే..డైజెషన్ కూడా బాగా అవుతుంది. గ్యాసెస్ ని ప్రేగుల్లో, పొట్టలో స్ట్రక్ అవకుండా మూవ్ చేయడానికి బాగా పనికొస్తుంది. పొట్టలో గ్యాస్ తేన్పురూపంలో వచ్చేస్తుంది. ఈ బెనిఫిట్స్ ఉంటాయని 2014వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ గర్జమడా( Gadjahamada Universithy- Indonesia)వాళ్లు యాలుక డైజెషన్ కు బాగా పనికొస్తుందని నిరూపించారు. వేడినీళ్లలో చిటికెడు పసుపు రెండు యాలుకల పొడికలిపి తీసుకుంటే..పొట్టలో అల్సర్స్ రాకుండా ఉండటానికి, పొట్ట అంచులవెంబడి జిగురు ఉత్పత్తిని బాగా పెంచి ఆ పొరలు హెల్తీగా ఉండేట్లు చేయడానికి కూడా యాలుకలు బాగా పనికొస్తాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

యాలుకల్లో ఉండే 12 రకాల యాక్టీవ్ కెమికల్ కాంపౌండ్స్ రక్షణ వ్యవస్థమీద బాగా పనిచేస్తాయట. రక్షణవ్యవస్థలో వైరస్ బ్యాక్టీరియాలను చంపేవి మాక్రోఫేస్ కణాలు, టీ కిల్లర్ సెల్స్. యాలకులు తీసుకోవడం వల్ల ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ బాగా అంది వైరస్ బ్యాక్టీరియాలను బాగా నాశనం చేయగలుతున్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.

చాలామందికి నోరు దుర్వాసన వస్తుంది. ఈ బ్యాడ్ స్మెల్ పోగొట్టుకోవడానికి..స్ప్రేస్ వాడుతుంటారు. దీనివల్ల లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. రక్షణవ్యవస్థ దెబ్బతింటుంది. నోట్లో చప్పరించేవి వాడటం కూడా మంచిది కాదు. భోజనం చేసినతర్వాత..యాలుకలను పెట్టుకుని..మెల్లగా ఒక్కో గింజను కొరుకుతూ అరగంట గంటపాటు యాలుకను నోట్లోనే పెట్టుకుండి. మంచి వాసన వస్తుంది. యాలుకల్లో ఉన్న ఇన్ని ఔషధగుణాలు ఉన్నాయికాబట్టి మీకు అవసరానికి తగ్గుట్టుగా ఉపయోగించుకోవచ్చు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news