సాధారణంగా ఒకరి మనసును గెలుచుకోవాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. అయితే ఎదుటివాళ్ళ మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. దీని కోసం చాలా కష్టపడుతూ ఉండాలి ఎన్నో తంటాలు పడితే కానీ ఒకరి మనసు గెలుచుకోవడం సాధ్యపడదు. ఎదుటి వాళ్ళ మనసు ఎలా గెలుచుకోవాలి…? అనే దాని కోసం కొన్ని టిప్స్ మీకోసం. వీటిని అనుసరించి వాళ్ల మనసును గెలుచుకోండి.
తరచు కాంప్లిమెంట్స్ ఇవ్వడం:
ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇష్టం. కాంప్లిమెంట్ ఇస్తే మీరు వాళ్ళకి చాలా స్పెషల్ అని తెలుస్తుంది. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరి మనసునైనా గెలుచుకోవాలంటే ముందు వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వండి.
మీ ఆలోచనలని వాళ్లతో పంచుకోండి:
మీరు లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాటిని బయటకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. దీని కోసం ఎప్పుడు మీరు కంగారు పడకండి. ఓపెన్ గా మీ ఫీలింగ్స్ వాళ్లతో పంచుకోండి.
బహుమతులు ఇవ్వడం:
వాళ్ళకి నచ్చినవి కానీ వాళ్లు కొనుక్కోవాలి అనుకునేవి గాని లేదా ఏమైనా బహుమతిని చూస్తే ఇది వాళ్లకి ఇవ్వాలి అనిపించినా కానీ…. ఇలా ఏమైనా గిఫ్ట్ ఇస్తే వాళ్లకి ఇస్తే వాళ్ళ మనసును గెలుచుకోవడానికి వీలుంటుంది.
మెసేజ్ మరియు ఫోన్ కాల్స్:
సాధారణంగా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కాల్ చేసుకుంటున్నారు. అలాగే మెసేజెస్ కూడా చేసుకుంటున్నారు. మీరు కొంచెం విభిన్నంగా ఒక అందమైన లెటర్ లేదా మంచి మంచి కవితలు లాంటివి ట్రై చేయండి.
పాటలని డెడికేట్ చేయడం:
ఏదైనా అందమైన పాటలని వాళ్ళకి డెడికేట్ చేయడం వల్ల వాళ్ళ మనస్సు గెలుచుకునే వీలు ఉంది. అలానే నిజాయితీగా ఉండండి. మీరు మీలాగే ఉండండి.