బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతుంటారు. బాలీవుడ్ మోస్ట్ ఫిట్ యాక్టర్.. ది మోస్ట్ హ్యాండ్సమ్ హంక్‌గా పేరు తెచ్చుకున్నాడు హృతిక్. క్రిష్ ఫ్రాంచైజీతో ఇండియన్ ఆడియెన్స్ కు సూపర్ హీరో లేడనే లోటును తీర్చాడు. హృతిక్ రోషన్‌కు కార్లంటే చాలా ఇష్టమట. తన గారేజ్ లో ఉన్న ఫేవరెట్ కారు తీసుకుని అలా ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టడమంటే ఈ గ్రీడ్ గాడ్ కు చాలా సరదానట. అందుకే హృతిక్ చాలా రకాల లగ్జరీ కార్లు హృతిక్ గ్యారేజ్‌లో ఉన్నాయట. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

హృతిక్ దగ్గర Audi Q7 మోడల్ ఉంది. దీని ధర కోటి 10 లక్షల వరకు ఉంటుంది.

హృతిక్ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ ఉంది. దీని ధర దాదాపు 5 కోట్ల 32 లక్షలు. 42వ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ ఈ కారును కొనుగోలు చేశాడని సమాచారం.

Mercedes Benz S క్లాస్ కూడా హృతిక్ గ్యారేజ్‌లో ఉంది. దీని ఖరీదు 2 కోట్లు 80 లక్షల వరకూ ఉంటుంది.

Mercedes V క్లాస్ ను సైతం ఇంటికి ఆహ్వానించాడు బాలీవుడ్ హీరో. దీని విలువ కోటిన్నర వరకు ఉంటుందని అంచనా.

మినీ కూపర్ కన్వర్టిబుల్ కూడా హృతిక్ కలెక్షన్లో ఉంది. దీని ధర 40 లక్షల వరకూ ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం హృతిక్ దీన్నే వినియోగిస్తాడని టాక్.

హృతిక్ గ్యారేజ్‌లో మరో ఖరీదైన కారు ఫెరారీ 360 మోడెనా కూడా ఉంది. మన దేశంలో అతి తక్కువ మంది దగ్గర ఈ కారు ఉంది. దీని ధర 4 కోట్లు.

హృతిక్ వద్ద అరుదైన 1996 నాటి ఫోర్డ్ ముస్తాంగ్ వింటేజ్ కారు కూడా ఉంది. ఈ కారు మోడల్ అందుబాటులో లేక చాలా కాలమైంది.

పోర్షే టర్బో కారుకు సైతం వెల్కమ్ చెప్పాడు హృతిక్. దీని ధర 2 కోట్ల మేర ఉంటుంది.