నువ్వు నన్ను విడిచినా, నేను ఏడవను.. హృతిక్ మాజీ భార్య.

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్.. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానే ఖాన్ వివాహం హృతిక్ రోషన్ తో 2000సంవత్సరంలో అయ్యింది. ఐతే వివాహంలో చాలా దూరం ప్రయాణించాక 2014లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వారిద్దరూ ఎక్కడ కనిపించినా చాలా స్నేహంగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

బయట కనిపించినపుడే కాదు సోషల్ మీడియాలోనూ వారి పద్దతి అందరికీ కొత్తగా అనిపిస్తుంటుంది. సాధారణంగా విడాకులు తీసుకున్నాక మళ్లీ వారి పేరెత్తితేనే చికాకు పడుతుంటారు. కానీ ఈ మాజీ దంపతుల కథే వేరు. తాజాగా సుసానే ఖాన్ సొషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేస్తూ, నువ్వు నన్ను విడిచినా, నేను ఏడవను, నీకోసం ఒక్కరోజు కూడా వేస్ట్ చేయనంటూ పోస్ట్ పెట్టింది.

అయితే దీనిపై హృతిక్ రోషన్ స్పందిస్తూ సూపర్ పిక్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.