షాకింగ్ రేంజ్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ బిజినెస్….!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటికే రోజురోజుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు తన కెరీర్లో తొలిసారి మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయి, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించాయి.

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే మంచి జోరు మీద సాగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకోగా, ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల హక్కుల కోసం పలువురు బయ్యర్ల మధ్య ఎంతో పోటీ నెలకొని ఉందట. ఇక నైజాం ఏరియా హక్కులను టాలీవుడ్ బడా నిర్మాత ఒకరు ఈ సినిమా హక్కులు దక్కించుకునేందుకు అందరికంటే ఎక్కువగా ఇవ్వడానికి సిద్ధమయినట్లు టాక్.

మహేష్ బాబు మరియి అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా మంచి హిట్స్ లో ఉండడం, అదీకాక మంచి ఎంటర్టైనర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో, ఈ సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడడం జరిగిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనుండి సినిమా యూనిట్….!!

Read more RELATED
Recommended to you

Latest news