భారీగా పడిపోయిన బంగారం…!

-

కరోనా వైరస్ కారణంగా అసలు డిమాండ్ లేని బంగారం ధరలు గత పది రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ స్థాయిలో బంగారం పెరగడమే. అలాంటి బంగారం శనివారం భారీగా దిగి వచ్చింది. బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా కిందికి దిగోచ్చాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం తగ్గింది. బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు,

1500 రూపాయలు భారీగా తగ్గింది. దీనితో 40,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… 1680 రూపాయలు భారీ గా తగ్గడంతో 44,290 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం విషయానికి వస్తే… 22 క్యారెట్లు పది గ్రాములకు 1500 రూపాయలు తగ్గడంతో 40,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 1680 రూపాయలు తగ్గింది.

దీనితో 44,290 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే విధంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1460 రూపాయల వరకు తగ్గడంతో 44,640 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1940 రూపాయలు తగ్గింది. దీనితో 41,920 రూపాయలకు చేరింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news