తెలంగాణాలో మొదటి కేసు నమోదు అయిన నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణా సర్కార్ ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకి వెళ్తున్నా సరే ఫలితం ఉండటం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కంగారు పడుతుంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కేసీఆర్ కి కూడా అర్ధం కావడం లేదు.
ఆయన చాలా పక్కా గా చర్యలు తీసుకుంటూ సమీక్షలు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు సీనియర్ అధికారులతో ఒక కమిటి వెయ్యాలి అని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలను వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఎక్కడా కూడా కేసులు ఉండకూడదు అని జీరో చెయ్యాలి అని భావిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దులను ఏ విధంగా కూడా అనుమతించవద్దు అని భావిస్తున్నారు.
ఎవరిని కూడా రాష్ట్రంలోకి అనుమతించవద్దు అని అవసరం అయితే ప్రత్యేక బలగాలను సరిహద్దుల్లో మొహరించాలి అని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం సహకారం కూడా తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మాజీ సిఎస్ లను ఆయన ప్రగతి భవన్ కి ఆహ్వానించి జిల్లాల బాధ్యతలను ఇవ్వాలి అని భావిస్తున్నట్టు సమాచారం. సిఎస్ గా పని చేసిన ఐఏఎస్ అధికారులను మంత్రులకు అటాచ్ చెయ్యాలి అని చూస్తున్నారు.
ఇప్పటికే ప్రజల్లో ఎక్కడా కూడా ఆందోళన అనేది లేకుండా ఆయన జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ ని ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం 5 ఏళ్ళు కోర్టు చుట్టూ తిప్పాలని భారీ జరిమానా విధించాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. రాజకీయ నాయకుల సలహాలను తీసుకోవాలని, జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్, తెలుగు దేశం మాజీ మంత్రులకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాలి అని కేసీఆర్ భావిస్తున్నారు.