గుడ్ న్యూస్…క‌రోనాతో చ‌నిపోయిన‌ వారికి భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన జగన్ స‌ర్కార్..!

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ దాటికి చాలా మంది ప్రజలు మృతి చెందారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ భారిన పడుతున్నారు. అటు వైద్యులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో  జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు పరిహరం అందచేయనుంది జగన్ ప్రభుత్వం.

డాక్టర్ చనిపోతే రూ. 25 లక్షలు, స్టాఫ్ నర్స్ చనిపోతే రూ. 20 లక్షలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ చనిపోతే రూ. 15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ. 10 లక్షల మేర ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. కోవిడ్ విధులకు సంబంధించి డ్యూటీల్లో ఉంటూ కరోనా సోకి చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు పరిహరం వర్తింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news