ఆక‌స్మిక త‌నిఖీల‌పై ముందే లేకులేంటి..? సీఎం కేసీఆర్‌పై ట్రోలింగ్‌!

-

సీఎం కేసీఆర్ అంటే చాలా ముందు చూపున్న నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. ఆయ‌న ఏ ప‌నిచేసినా చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఎవ‌రికి ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో ముందే ఆలోచించుకుని మ‌రీ ప‌ని మొద‌లు పెడ‌తారు. అయితే సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య చాలా చురుగ్గా ప‌నిచేస్తున్నారు. అన్ని నిర్ణ‌యాల‌ను వ‌రుస‌పెట్టి తీసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక రీసెంట్ గా కూడా ఆయ‌న చెప్పిన విష‌యాలుఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

ఇక తాజాగా ఉన్న‌తాధికారుల‌తో మీటింగ్ పెట్టిన కేసీఆర్‌… క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు సీరియ‌స్ వార్నింగే ఇచ్చార‌ని చెప్పాలి. స‌రిగ్గా ప‌నిచేయ‌ట్లేదంటూ సీరియ‌స్ అయ్యారు. ఇందులో భాగంగా వారికి ఓ షాకింగ్ విష‌యం చెప్పారు. త్వ‌ర‌లోనే ఆయా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం స్ప‌ష్టం చేశారు.

అయితే ఏ రోజు ఎక్క‌డ చేస్తామో ముందే చెప్పేశారు. జూన్ 20న సిద్దిపేట, 21న కామారెడ్డి జిల్లాల్లో అలాగే వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేప‌డుతామ‌ని, తేడాలుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక్క‌డే ఆయ‌న ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు. ఆక‌స్మిక త‌నిఖీలంటే చెప్ప‌కుండా చేయాలి గానీ ముందే చెప్ప‌డ‌మేంటంటూ నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ముందే చెప్తే ఆ డేట్‌కు అంతా క్లియ‌ర్ చేసుకుంటారు అని చెబుతున్నారు. మ‌రి సీఎం కేసీఆర్‌కు ఇది తెల్వ‌కుండానే చెప్ప‌రా ఏమో.

Read more RELATED
Recommended to you

Latest news