తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. ఆహార సబ్సిడీ కింద నుంచి భారీగా నిధులు

-

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆహార సబ్సిడీ కింద నుంచి భారీగా నిధులు విడుదల చేసినట్లు ప్రకటన చేసింది. బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ఏపీకి 2016 నుంచి ఇప్పటి వరకు ఆహార సబ్సిడీగా రూ. 36,038 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన ఆహార సబ్సిడీ వివరాలు తెలిపారు.

ఏపీకి 2021-22లో ఫిబ్రవరి 7 వరకు 6,393 కోట్లు,2020-21లో 8,425 కోట్లు,2019-20లో 7,404 కోట్లు,2018-19లో 4,543 కోట్లు,2017-18 లో 6,060కోట్లు 2016-17లో 3,213 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి 26,766 కోట్లను కేంద్రం నుంచి ఆహార సబ్సిడీని తెలంగాణ అందుకుందని.. తెలంగాణకి 2021-22లో ఫిబ్రవరి 7 వరకు 6897 కోట్లు,2020-21లో 6,880 కోట్లు,2019-20లో 4859 కోట్లు,2018-19లో 2559 కోట్లు,2017-18 లో 3854 కోట్లు 2016-17లో 1717 కోట్లు కేటాయింపులు జరిగినట్లు ప్రకటన చేశారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), 2013 కింద లబ్ధిదారుల కవరేజీని పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు లబ్ధిదారుల కవరేజీని 2013లో అప్పటి ప్రణాళికా సంఘం NSSO గృహ వ్యయ సర్వే 2011-12 ఆధారితంగా నిర్ణయించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news