కరోనా అంతం కాలేదు… భవిష్యత్తులో మరిన్ని వేరింట్లు తప్పవు: WHO

-

రెండేళ్ల నుంచి కరోనా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే అన్ని దేశాలు పస్ట్ , సెకండ్, థర్డ్ వేవ్ లను చూశాయి. చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి అన్ని దేశాలకు వ్యాపించింది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, బీ.ఏ2 ఇలా అనేక వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా రీ ఇన్ఫెక్షన్ రావడం కలవరపెడుతోంది. ఇండియాలో కూడా ఇటీవల థర్డ్ వేవ్ భయాందోళనలు కలిగించింది.

ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా అంతమైనట్లు ఇప్పుడే భావించకూడదని.. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు పుట్టుకురావచ్చని WHO ఛీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. కరోనా వైరస్ జన్యు పరివర్తన చెందుతుందని వెల్లడించారు. మహమ్మారిని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానకిి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news