మన సినిమాలపై కోట్లు కుమ్మరిస్తున్న బాలీవుడ్!

-

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే.. జస్ట్ బాలీవుడ్. మరి ఇప్పుడు..? ఇండియన్ ప్రొజెక్టర్​పై.. సౌత్ జెండా రెపరెపలాడుతోంది. అందులోనూ.. టాలీవుడ్ హీరోయిజం దుమ్మురేపుతోంది! ఇదేదో మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నది కాదు.. సాక్షాత్తూ బాలీవుడ్ జనాలే.. ఢంకా భజాయించి చెబుతున్నారు.

ఎన్టీఆర్-రామ్​చరణ్ హీరోయిజానికి.. రాజమౌళి ట్రేడ్ మార్క్ తోడవడంతో.. ఆర్ఆర్ఆర్ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.140 కోట్ల భారీ ధర పలికింది. లేటెస్ట్​గా రిలీజైన మెగాస్టార్​ గాడ్ ఫాదర్ మూవీకి సైతం కళ్లు చెదిరే రేట్ దక్కింది. డిజిటల్&శాటిలైట్ హక్కులు కలిపి రూ. 45 కోట్లకు అమ్ముడుపోయింది.

పుష్పరాజ్​గా అల్లు అర్జున్ చేసిన మేనరిజం.. దేశవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్.. రూ.28 కోట్లు దక్కాయి.

ఆచార్య : చిరంజీవి-రామ్​చరణ్ నటించిన ఆచార్య చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.26 కోట్లకు అమ్ముడుపోయాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ.. భీమ్లా నాయక్ కోసమూ బాలీవుడ్ జనాలు పోటిపడ్డారు. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం రూ.23 కోట్లు చెల్లించారు.

అఖండ : నందమూరి నటసింహం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “అఖండ” బిజినెస్ బాలీవుడ్​ లోనూ భారీగానే సాగింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.21 కోట్లకు కొనుగోలు చేశారు.

సర్కారువారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట చిత్రానికి కూడా మంచి బిజినెస్సే జరిగింది. ఈ మూవీ రైట్స్ కోసం రూ.21 కోట్లు వెచ్చించారు.

వారియర్ : ఎనర్జిటిక్ హీరో రామ్​ రీసెంట్ మూవీ “వారియర్”. ఈ మూవీకి హిందీ డిస్ట్రిబ్యూటర్లు రూ.16 కోట్లు పెట్టారు. శ్యామ్ సింఘ రాయ్: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ శ్యామ్ సింఘ రాయ్ చిత్రానికి.. హిందీ డబ్బింగ్ రైట్స్ కింద రూ.10 కోట్లు దక్కాయి.

సీతారామం : దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాగూర్ జంటగా వచ్చిన.. ఈ క్యూట్ లవ్ స్టోరీకి సైతం బాలీవుడ్ రూ.8 నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేసింది.

కార్తికేయ-2 : నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన “కార్తికేయ” సీక్వెల్.. ఉత్తరాదిన ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 5 కోట్లకు అమ్ముడుపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news