ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ సంస్థ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏపీలో ప్రయాణికుల చార్జీలను ఆర్టీసీ సంస్థ భారీగా పెంచేసింది. డీజిల్ పేరుతో పల్లె వెలుగు బస్సు లో 2 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్సు లో 5 రూపాయలు, ఏసీ బస్సులో పది రూపాయల చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు ఏపీ ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటన చేశారు.
పల్లె వెలుగు బస్సు లో కనీస టికెట్ ధర 10 రూపాయలు అని పేర్కొన్నారు. పెరిగిన టికెట్ల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ద్వారకా తిరుమల రావు సంచలన ప్రకటన చేశారు.
డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని… ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుందని వెల్లడించారు. కోవిడ్ వల్ల గత రెండేళ్ల కాలంలో రూ. 5680 కోట్లు నష్టం వచ్చిందని స్పష్టం చేశారు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.