లైగ‌ర్ డిజిట‌ల్ రైట్స్ కు భారీ ధ‌ర!

-

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా వ‌స్తున్న తాజా సినిమా లైగ‌ర్. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో యాక్షన్ సినిమాగా తెర‌కెక్కుతుంది. అలాగే ఛార్మి పీసీ క‌నెక్ట్స్ , క‌రణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. కాగ ఈ సినిమా ఈ ఏడాది ఆగ‌స్టు 25 వ తేదీని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుడ‌ల అయిన పోస్ట‌ర్లు, ఫ‌స్ట్ గ్లింప్స్ లైగ‌ర్ కు మంచి హైప్ తీసుకువ‌చ్చింది.

అలాగే అంచ‌నాలు కూడా భారీగానే పెరిగాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌పంచ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. దీంతో అంచ‌నాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఈ సినిమా భారీ హిట్ కొట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయని తెలుస్తుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 60 కోట్లు వెచ్చించినట్టు స‌మాచారం. అయితే లైగ‌ర్ డిజిటల్ రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడు పోవ‌డంతో ఈ సినిమా పై మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news