కరోనా పెరుగుతున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన వీడియో కాలింగ్ యాప్ జూమ్..స్కూల్ విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌లో నిర్వహించే ఆన్‌లైన్ మీటింగ్స్ వరకు..ఇలా అన్నీ జూమ్ యాప్‌లో జరిగేవి.ఈ తరుణంలో జూమ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది ఆగస్ట్ నుంచి క్రోమ్ బుక్స్ ల్యాప్‌ట్యాప్‌లలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది యూజర్లకు భారీ షాక్ అనే చెప్పాలి.
ల్యాప్ ట్యాప్స్ కంటే లిమిటెడ్ సపోర్ట్‌తో గూగుల్ క్రోమ్‌బుక్స్ ను విడుదల చేసింది. వీటిలో విండోస్ సపోర్ట్ చేయదు. గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రోమా ఓఎస్ మాత్రమే వినియోగించుకోవచ్చు. క్రోమ్ బుక్స్‌కు సపోర్ట్ చేసే జుమ్‌లాంటి యాప్స్‌తో పాటు ఇతర యాప్స్‌ను వినియోగించుకోవచ్చు..ఈ నేపథ్యంలో 2020 ప్లాన్‌లో భాగంగా యూజర్లకు ఫస్ట్ క్లాస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను గూగుల్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
జూమ్ తరహాలో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మనకు కావాల్సిన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే టెక్నాలజీపై కసరత్తులు చేసింది.క్రోమా ఓఎస్ ఆధారిత క్రోమ్‌బుక్‌లలో క్రోమ్ యాప్‌లను నిలిపివేయనుంది. వాటిలో జూమ్ యాప్ కూడా ఉంది. ప్రోగ్రెసీవ్ వెబ్ యాప్స్‌కు మాత్రమే అనుమతిస్తుండగా.. గూగుల్ నిర్ణయంతో..జూమ్ సైతం క్రోమ్ బుక్స్‌లో సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఒకవేళ క్రోమ్ బుక్స్‌లో జూమ్ యాప్ కావాలనుకుంటే జూమ్ ఫర్ క్రోమ్ పీడబ్ల్యూఏ వాడాలని జూమ్ సంస్థ క్రోమ్‌బుక్ యూజర్లకు విజ్ఞప్తి చేసింది.