కరోనా వచ్చిందని భార్యని విడిచి లవర్ దగ్గరికి పారిపోయిన భర్త..

కరోనా వచ్చిందని చెప్పడానికే భయపడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాని వాడుకుంటున్న వారు కూడా ఉన్నారు. ముంబై చెందిన వ్యక్తి కథ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతా. 28ఏళ్ల యువకుడు తనకి కరోనా వచ్చిందని భార్యకి చెప్పి కనిపించకుండా పోయాడు. దాంతో భార్య, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన ముంబైలోని తాలోజీ లో జరిగింది. ఇలా జరిగిన కొన్ని రోజులకి కనిపించకుండా పోయిన వ్యక్తి తాలూకు బైక్ కనిపించింది. హెల్మెట్, వ్యాలెట్ కూడా అక్కడే ఉండడంతో అనుమానం ఇంకా పెరిగింది.

corona-positive

ఐతే పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో ఇండోర్ లో ఉన్నాడని కనుక్కున్నారు. భార్యని విడిచి వెళ్ళిన అతడు, ఇండోర్ లో మరో అమ్మాయితో కనిపించడం షాకింగ్ గా మారింది. పూర్తిగా తన వేషాధారణని మార్చివేసి ఇండోర్ లో తన లవర్ తో కొత్త జీవితం గడుపుతున్నాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
.