ఆ మందు కోసం భారత్ ముందు మోకరిల్లిన 40 దేశాలు…!

-

ప్రపంచ దేశాలకు భారత్ ఇప్పుడు ఔషధ ప్రదాయినిగా మారింది. కరోనాను ఎదుర్కోవడంలో మలేరియాను ఎదుర్కోవడంలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పని చేస్తుందని గుర్తించారు. అమెరికాలో చాలా సమర్ధవంతంగా ఇది పని చేస్తుంది. అక్కడ చాలా మందికి ఈ మందుతోనే వైద్యులు చికిత్స చేస్తున్నారు. మూడవ రోజు ఇది వ్యాధిని దాదాపుగా అదుపులోకి తీసుకొస్తుంది అని అక్కడి వైద్యులు చెప్తున్నారు.

ప్రణాళిక ప్రకారం దీన్ని వాడితే కరోనా వైరస్ కట్టడి అవుతుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రెజిల్, స్పెయిన్, ఇజ్రాయెల్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు సహా ఇప్పుడు 40 దేశాలు మన ముందు క్యూ కట్టాయి. ఇటీవల యుకె, అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు భారత్ వీటిని సరఫరా చేసింది. దీనిపై ఆ దేశాలు హర్షం వ్యక్తం చేసాయి. కష్ట కాలంలో తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాయి.

ప్రస్తుతం భారత్ లో దాదాపు వంద టన్నుల మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మనకు కావాల్సింది పది టన్నులే. మిగిలిన వంద టన్నుల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. భారత్ కి భారీ మొత్తం చెల్లించడానికి కూడా సిద్దమవుతున్నాయి. ప్రపంచం మొట్ట వంద బిళ్ళలు విడుదల అయితే అందులో 70 బిళ్ళలను మన దేశంలోనే తయారు చేస్తారు. అందుకే ఇప్పుడు భారత్ తో ఈ మందు కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news