షాకింగ్: భార్యతో శృంగారం.. 10 నిమిషాల్లో గజినిగా మారిన భర్త..!!

-

ఐర్లాండ్ దేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్యతో శృంగారంలో పాల్గొన్న భర్తకు పది నిమిషాల్లోనే మతిమరుపు వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం.. 66 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తన ఫోన్‌లో తేదీని చూసుకుని, ముందు రోజు తన పెళ్లి రోజని, ఆ తేదీని ఎలా మర్చిపోయానని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా.. వారు షాక్‌ అయ్యారు. అయితే ముందు రోజు సాయంత్రం అతడి ఇంట్లో పెళ్లి రోజు వేడుకలు జరిగాయి. ఆ విషయాన్ని ఆ వ్యక్తి మర్చిపోవడమే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యానికి గురి చేసింది.

regular-sex
regular-sex

ఈ విషయాన్ని భార్యా పిల్లలు గుర్తు చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే, అతని పేరు, వయసు, పాత విషయాలు అన్ని ఆ వ్యక్తికి గుర్తుండటం విశేషం. కానీ పెళ్లి రోజు జరిగిన ఈవెంట్‌ని మర్చిపోవడం తన భార్యకు అర్థం కాలేదు. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. స్వల్పకాలిక మతిమరుపు వచ్చిందని, 50-70 ఏళ్ల మధ్య వ్యక్తులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news