ఈటలకు బిగ్ షాక్.. టిఆర్ఎస్ లో చేరిన 150 నేతలు !

-

హుజూరాబాద్ నియోజకవర్గ ములో ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన నేతలు టిఆర్ఎస్ లో చేరారు. వీణవంక మండలం దేశాయి పల్లి గ్రామానికి చెందిన గౌడ, బుడగ‌జంగాలు, మున్నూరు కాపు కుల సంఘాల వారు , ఉప సర్పంచ్ నల్ల సత్యనారాయణ రెడ్డి ఆద్వర్యంలో రెడ్డి సంఘం వారు నర్సింగాపూర్ గ్రామం నుండి పద్శశాలీ ‌సంఘం నేతలు తెరాసలో చేరారు. ఈ రెండు గ్రామాల నుంచి దాదాపు 150 మంది తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

TRS-Party | టీఆర్ఎస్

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దామని.. కులవృత్తులను బలో పేతం‌చేసేలా‌ సీఎం‌ కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. గొల్ల కురుమలకు గొర్రెలు మత్స్యకారులలకు చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేశారని.. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి పంపిణీ చేసి రైతును రాజుగా మార్చారని వెల్లడించారు. నేటి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అని తెలిపారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజూరాబాద్ అని.. తన స్వార్థం‌కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news