హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్ రికార్డు స్థాయి లో నమోదవుతోంది. ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ నమోదవుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఏకంగా 61.66 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక పోలింగ్ ముగిసే సరికి… పోలింగ్ శాతం 85 శాతానికి పైగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇక అటు బద్వేల్ ఉప ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం బాగా పడిపోయింది. హుజురాబాద్ పోలింగ్ తో పోల్చితే.. బాగా తగ్గింది. బద్వేల్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్య లో ఓటర్లు క్యూ కట్టారు. కరోనా నియామాలు పాటిస్తూనే.. ఓటర్లు క్యూలో ఉన్నారు. కాగా.. ఈ రెండు ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళ సాయంత్రం 7 గంట ల వరకు కొనసాగనుంది. ఇక కరోనా సోకిన వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిం చనున్నారు.