రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక నిన్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు అన్ని పార్టీలూ సన్నద్ధమవతున్నాయి. ఇక ఈటల కూడా బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరి హుజూరాబాద్ ఎన్నికలు ఎప్పుడొస్తాయనే చర్చ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితులను బట్టి చూస్తుంటే అక్టోబర్‌లో ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు కరోనా పరిస్థితులు కూడా కంట్రోల్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగూ రాజీనామా చేశాక ఆరునెలలు టైమ్ ఉంటుంది. కాబట్టి ఆ నెలలోనే వచ్చే అవకాశం ఉంది.
కాగా బీజేపీ మాత్రం ఉప ఎన్నిక త్వరగా నిర్వహించాలని కోరుతోంది. ఎందుకంటే ఈటల ప్రభావం తగ్గకముందే ఎన్నికలు నిర్వహిస్తే గెలిచేందుకు అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. కానీ టీఆర్ ఎస్ మాత్రం ఎంత లేట్ అయితే అంత బెటర్ అని చూస్తుంది. లేట్ అయితే ప్రజల్లో ఈటల పట్ల సానుభూతి తగ్గుతుందని, అప్పుడు నిర్వహిస్తే గెలిచే అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.