ప్రస్తుతం తెలంగాణలో ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అనే రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ఈటల రాజకీయాల పనిని కేవలం కొందరికే ఇస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే ఈటలకు ఎవ్వరైతే సన్నిహితంగా ఉంటున్నారో వారితోనే వైరం పెట్టిస్తున్నారు. అంతే తప్ప ఆ బాధ్యతను ఎవరికి పడితే వారికి ఇవ్వట్లేదు గులాబీ బాస్.
అందులో భాగంగా హరీశ్‌రావుకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. హుజూరాబాద్ రాజకీయాలకు హరీశ్ రావును ఇన్‌చార్జిగా నియమించి రాజకీయ వ్యూహాలను అమలు చేయిస్తున్నారు. కానీ మొదటి నుంచి కేటీఆర్ మాత్రం ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అది కూడా గులాబీ బాస్ ప్లాన్ ప్రకారమే అని తెలుస్తోంది.
కేటీఆర్ ను ఇప్పటి నుంచే వీలైనంత సేఫ్ జోన్‌లోనే ఉంచుతున్నారు కేసీఆర్. ఎందుకంటే రాజకీయ విమర్శలు ఈటల వ్యవహారంలో కాస్త ఎక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కేటీఆర్ ఈ వ్యవహారాలను చూస్తే ఆయనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. రాబోయే కాలంలో సీఎం అయ్యే కేటీఆర్‌పై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత రాకుండా చూసేందుకు కేసీఆర్ ఆయన్ను దూరంగా ఉంచారని సమాచారం. మొత్తంగా చూస్తే ఈ రాజకీయాల్లో హరీశ్‌రావును ఇరికించారనే ప్రచారం కూడా నడుస్తోంది.