నేరేడు గింజలతో ఈ సమస్యలు మాయం..!

-

నేరేడు పండ్లు మాత్రమే కాదు. నేరేడు గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు కి ఇది మరింత ఆరోగ్యం. నేరేడు పండ్ల లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి.

నేరేడు

ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది.

నేరేడు గింజల పొడిని ఎలా ఉపయోగిస్తారు..?

దీని కోసం మొదట నేరేడు పండ్లుని కడిగి వాటిని ఎండలో ఎండబెట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయాలి. ఒక స్పూన్ పౌడర్ ని తీసుకుని పాలల్లో కలిపి పరగడుపున ఆ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

నేరేడు గింజల పొడి వల్ల కలిగే లాభాలు:

నేరేడు గింజల పొడి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నేరేడు గింజల పొడిని పెరుగు తో కలిపి తీసుకోవడం వల్ల స్టోన్స్ సమస్య ఉండదు. కాబట్టి ఈ విధంగా అనుసరించి అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news