ఉప ఎన్నిక సరే.. అభ్యర్థుల ఖరారు ఎప్పడో..

-

హుజూరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఇక అభ్యర్థల ఖరారు పైనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ మాత్రమే తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించింది. ఇతర ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిత్వాలను ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ తరుపున దాదాపుగా ఈటెల రాజేందర్ పేరు ఖరారు అయినప్పటికీ అధికారికంగా బీజేపీ వెల్లడించలేదు. మరోవైపు ఈటెల సతీమణి జమున పేరు కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా సందిగ్థ పరిస్థిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపించినా… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయింది. కాగా ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతనలు మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ పార్టీ అప్పగించింది. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా రాజీనామా అనంతరం నుంచి నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్యే ప్రముఖంగా పోటీ నెలకొంది. నిజానికి షెడ్యూల్ విడుదల కాకముందే మూడు నెలల నుంచి ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం, విమర్మల పర్వం కొనసాగుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లు తమ అభ్యర్థల్ని అధికారికంగా ప్రకటిస్తే హుజూరాబాద్ రాజకీయం మరింత రంజుగా మారబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news