చదువు రాని ”సన్నాసి” బండి సంజయ్…ఆయనకు ఏం తెలీదు : బాల్క సుమన్

-

బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి పై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. బండి సంజయ్ బిజెపికి గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని చురకలు అంటించారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదని ఫైర్‌ అయ్యారు.

ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఈ విషయం సన్నాసి బండి సంజయ్ కు తెలియదని ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్కగా ఉందని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా… హుజురాబాద్‌ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. వినాయక నిమజ్జనం ముగిసింది… ఇక ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలి ఉందని… ఆ బాధ్యత ప్రజలు తీసుకుంటారన్నారు. సదువు రాని సన్నాసి బండి సంజయ్ కు ఏమి చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news