హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఖ‌రారు… ప్రకటించిన కేసీఆర్‌

-

హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాక ముందే…అక్కడి రాజకీయాలు వెడేక్కాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల వేటపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. హుజూరాబాద్‌లో బలమైన నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్… కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అయితే.. తాజాగా హుజురాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ ను ఫైనల్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మరి కాసేప‌ట్లో అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రస్తుతం టీఆర్ఎస్‌వీ ప్రెసిడెంగ్‌గా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌…. టీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నేత కావడంతో గులాబీ బాస్‌… గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ వైపునకే మొగ్గు చూపినట్లే కనిపిస్తోంది. కాగా..ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజురాబాద్‌ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news