హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల అనుకూల విద్యార్ధి సంఘాలు యూనివర్సిటీ లో భారీ ర్యాలీ నిర్వహించాయి. దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ మరో ర్యాలీ నిర్వహించింది. దీంతో ఒక్కసారిగా సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.caa
ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించి పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. యూనివర్సిటీలో ఎలాంటి దాడులు, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఏబీవీపీ పోస్టర్ల ప్రదర్శించగా లెఫ్ట్ అనుకూల సంఘాలు విద్యార్ధులు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించారు.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో విద్యార్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో విద్యార్థి సంఘాల మీద పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. విద్యార్ధి సంఘాలు చేసే నిరసనలు ఉద్యమాలు, వాళ్ళ ప్రదర్శించే పోస్టర్లు వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తున్నారు, అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విద్యార్ధి సంఘాల నాయకుల మీద కన్నేసి ఉంచారు పోలీసులు.