తన కుమారుడి పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం ర‌మేష్‌..

-

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో స‌హా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయన తనయుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో పీఎంవోలో మోదీని కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు శుభలేఖ అందించారు.

ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 75 కోట్ల రూపాయలను ఈ నిశ్చితార్థం కోసం ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. 75 మందికి పైగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. వారి కోసం సీఎం రమేష్ 15 స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news