తెలంగాణలో గులాబ్ అలజడి మొదలైంది. నిన్న ఏపీని వణికించిన గులాబ్ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. జీహెఎంసీ పరిధిలోని చందానగర్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఆదిలాబా
ద్ జిల్లాల్లో గులాబ్ ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా వెమునూరు గ్రామ శివారు చంద్రు తండాలో పిడుగుపాటుతో పశువులు మరణించాయి. మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలో వేకువజామున కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్కు గోదావరి వరద పోటెత్తింది. దాదాపు 2.5 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. దీంతో గేట్లుతెరిచి కాళేశ్వరం సుందిళ్ల ప్రాజెక్ట్ వైపు నీటి వదులుతున్నారు.