హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. మందేసి యువతి ప్రాణం తీశాడు !

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో కారులో ఇద్దరు విద్యార్థులు బంజారాహిల్స్ నుండి లింగంపల్లి వైపు వెళ్తుండగా HCU గేట్ 2 వద్ద కారు చెట్టును గుద్దేసింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ప్రియాంక(20) అక్కడికక్కడే మృతి,మిత్తి మోడీ(20)కు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన ప్రియాంక(20) మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. నిన్న రాత్రే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ యువకుడు తాగి డ్రైవ్ చేసినట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్ లోని ఎయిర్ లైఫ్ పబ్లో యువతి, యువకుడు ఇద్దరూ మద్యం సేవించారని చెబుతున్నారు. మోడీకి బ్రీత్ అనలైజ్ టెస్ట్ లో 45 శాతం నమోదు అయింది. రష్యాలో ఎంబీ బిఎస్ చదువుతున్న మృతురాలు ప్రియాంక లాక్ డౌన్ లో హైద్రాబాద్ వచ్చి ఇక్కడే ఉంటోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మధురానగర్ లోని తన ఇంటి నుండి స్నేహితుల దగ్గరికి వెళుతున్నానని తల్లితో చెప్పిన ప్రియాంక అప్పటి నుండి మళ్ళీ ఇంటికి రాలేదు. వైజాగ్ కు చెందిన మిత్తి మోడీ అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.