హైదరాబాద్ సిటీలోని అన్ని రూట్లలో 25% సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మొత్తం 29 డిపోలలో దాదాపు 2800 బస్సులు ఉన్నాయి. అంటే గతంలో హైదరాబాద్ రీజియన్ లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు నడిచేవి కానీ ఇప్పుడు నిభందనల ప్రకారం ఇందులో 25% సిటీ బస్సులు మాత్రమే రోడ్డు ఎక్కాయి. ప్రస్తుతం నడిచే 25 శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి డిపోకు 35 బస్సుల చొప్పున ప్రస్తుతం బస్సులు నడుపుతున్నట్టు చెబుతున్నారు. మొదటి రోజు డిపోలకు కేటాయించిన బస్సులలో సగం బస్సులనే ఆర్టీసీ అధికారులు రోడ్డెక్కించనున్నారని అంటున్నారు. ఇక సిటి బస్సులతో పాటు కర్నాటక, మహరాష్ట్రకు నడిపే సర్వీసులను కూడా పునరుద్దరణ చేయడంతో దూర ప్రాంత సర్వీసులు కూడా మొదలయినట్టు అయింది. అయితే ఇంకా ఏపీ – తెలంగాణా బస్సుల విషయంలో ఇంకా సందిగ్దత నెలకొంది.