కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

కరోనా కేసులు రోజు రోజుకీ విజ్రుంబిస్తున్నాయి. అయితే మరణాల రేట్ తక్కువ ఉండడం, రికవరీ రేట్ ఎక్కువ ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా, ప్రజా ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువ గా వారు మృత్యు వాత కూడా పడుతున్నారు. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే మృత్యువాత పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బి నారాయణరావు బీదర్‌ నియోజకవర్గం నుంచి కర్ణటక విధానసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కరోనా బారిన పడిన ఆయన ఈ నెల ఒకటో తారీఖున బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. ఇటీవల నారాయణరావు ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో నిన్న మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నారాయణరావు వయస్సు 77 సంవత్సరాలు. అయితే నిన్న కాక మొన్ననే ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కూడా కరోనాతో మరణించారు. ఆయన బెలగావి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.